తెలంగాణలో కొత్తగా 210 కరోనా కేసులు
- గత 24 గంటల్లో 40,997 కరోనా పరీక్షలు
- జీహెచ్ఎంసీ పరిధిలో 87 మందికి పాజిటివ్
- రాష్ట్రంలో ఒకరి మృతి
- ఇంకా 3,833 మందికి చికిత్స
రాష్ట్రంలో ఇప్పటివరకు 6,78,688 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,70,846 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 3,833 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 4,009కి పెరిగింది.
