'పుష్ప' కథ నాకు పూర్తిగా తెలియదు: రష్మిక
- రిలీజ్ కి రెడీ అవుతున్న 'పుష్ప'
- శ్రీవల్లి పాత్రలో రష్మిక
- తన పాత్ర పట్ల సంతృప్తి
- ఈ నెల 17వ తేదీన విడుదల
ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్సులో భాగంగా రష్మిక మాట్లాడింది. ''పుష్ప కథ విన్నప్పుడు మీకు ఏమనిపించింది? అని అంతా అడుగుతున్నారు. అసలు నాకు సుకుమార్ గారు పూర్తి కథ చెబితేనే గదా. ఆయన నా పాత్ర ప్రాధాన్యతను గురించి చెప్పారే తప్ప పూర్తి కథను చెప్పలేదు. ఆయన పట్ల గల నమ్మకంతో నేను ఒకే చెప్పేశాను.
అయితే షూటింగు జరుగుతున్నప్పుడు నా పాత్ర విషయంలో నాకు సంతృప్తి పెరుగుతూ వెళ్లిందే తప్ప తగ్గలేదు. నా పాత్రకి మంచి గుర్తింపు వస్తుందనే నమ్మకం బలపడుతూ వెళ్లింది. ఫస్టు పార్టు పూర్తవుతోందంటే బాధగా అనిపించింది. రెండవ భాగం ఎప్పుడు మొదలవుతుందా అని ఆత్రుతగా ఉంది" అంటూ చెప్పుకొచ్చింది