తెలంగాణలో మరో 203 మందికి కొవిడ్ పాజిటివ్
- గత 24 గంటల్లో 40,730 కరోనా పరీక్షలు
- జీహెచ్ఎంసీ పరిధిలో 87 కొత్త కేసులు
- రాష్ట్రంలో ఒకరి మృతి
- ఇంకా 3,852 మందికి చికిత్స
అదే సమయంలో 160 మంది కరోనా నుంచి కోలుకోగా, రాష్ట్రంలో ఒక మరణం సంభవించింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 6,77,341కి పెరిగింది. 6,69,488 మంది కరోనా నుంచి విముక్తులు కాగా, ఇంకా 3,852 మంది చికిత్స పొందుతున్నారు. అటు, కరోనా మృతుల సంఖ్య 4,001కి పెరిగింది.
