ధరల పెంపుబాటలో హోండా, రెనో, టాటా మోటార్స్
- అంతర్జాతీయంగా ముడి పదార్థాల ధరల పెంపు
- అధికమైన రవాణ చార్జీలు
- పెరిగిపోతున్న ఉత్పాదక వ్యయం
- ఇప్పటికే నిర్ణయం తీసుకున్న మారుతి, ఆడి, బెంజ్
తాజాగా హోండా, టాటా మోటార్స్, రెనో కూడా అదే బాటలో నడవాలని భావిస్తున్నాయి. ధరలు పెంచేందుకు ఈ మూడు దిగ్గజ సంస్థలు సన్నద్ధమవుతున్నాయి. ఉత్పాదక వ్యయంలో కొద్దిమేర అయినా సర్దుబాటు చేసుకునేందుకు ధరలు పెంచడం తప్పనిసరి అని ఆయా కంపెనీల అభిప్రాయం.
భారత్ లో సిటీ, అమేజ్ వంటి మోడళ్లతో గణనీయంగా అమ్మకాలు సాగిస్తున్న హోండా ఇప్పటికే గత ఆగస్టులో ఓసారి ధరలు పెంచింది. క్విడ్, కైగర్, ట్రైబర్ వంటి మోడళ్లతో వినియోగదారులను ఆకట్టుకుంటున్న ఫ్రెంచ్ కంపెనీ రెనో భారత్ లో వచ్చే ఏడాది ఆరంభం నుంచి కొత్త ధరల శ్రేణిని ప్రకటించనుంది.