'లక్ష్య' నుంచి వచ్చేస్తున్న మరో లిరికల్ సాంగ్!
- నాగశౌర్య నుంచి 'లక్ష్య'
- విలువిద్య నేపథ్యంలో కథ
- ఈ నెల 4న లిరికల్ సాంగ్ రిలీజ్
- 10వ తేదీన సినిమా విడుదల
ఈ నెల 4వ తేదీన ఈ సినిమా నుంచి ఒక లిరికల్ వీడియోను రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ ఒక పోస్టర్ ను వదిలారు. నాగశౌర్య సరసన నాయికగా కేతిక శర్మ నటించింది. ఈ సినిమాలో జగపతిబాబు .. సచిన్ ఖేడ్కర్ కీలకమైన పాత్రలను పోషించారు.
గ్రామీణ నేపథ్యంలోను .. పట్నంలోను ఈ కథ నడుస్తుంది. విలువిద్యకి సంబంధించిన ఇతివృత్తం ప్రధానంగా కనిపిస్తుంది. ఒక వైపున ప్రేమ .. మరో వైపున స్నేహం .. మధ్యలో లక్ష్యం .. వీటి చుట్టూనే కథ తిరుగుతుంది. ఈ నెల 10వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు.