ఎంత కష్టమొచ్చిందో.. పేగు తెంచుకుపుట్టిన బిడ్డను నడుముకు కట్టుకుని ఆత్మహత్య చేసుకున్న తల్లి
- నీటి కుంటలో శవమై తేలిన తల్లీబిడ్డ
- కుటుంబ సభ్యుల వేధింపులే కారణమంటున్న స్థానికులు
- భర్తతో గొడవపడి ఇంట్లో నుంచి వెళ్లిన భార్య
- రెండు రోజులుగా వారి కోసం గాలింపు
వారి కోసం కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ప్రయోజనం లేకపోయింది. తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు గాలింపు చేపట్టగా ఇవాళ ఉదయం మిడ్జిల్ శివారులోని నీటి కుంటలో వారిద్దరి మృతదేహాలు స్థానికులకు కనిపించాయి. దీంతో వారు వెంటనే ఆమె కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారమందించారు. చిన్నారిని నడుముకు కట్టుకుని సరిత చనిపోవడం అక్కడి వారిని కదిలించింది. కుటుంబ సభ్యుల వేధింపులు తట్టుకోలేకే సరిత ఆత్మహత్య చేసుకుందని స్థానికులు పోలీసులకు చెప్పారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.