Chiranjeevi: మెగాస్టార్ నా పెళ్లికి వచ్చారు.. చిన్నప్పటి మాట నిజమైంది: కార్తికేయ

Kathikeya about his childhood dream
షార్ట్స్‌లో చూడండి
హీరో కార్తికేయ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన దగ్గర నుంచి, గ్యాప్ లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఆ మధ్య ఒక ఈవెంట్ లో మెగాస్టార్ పాటకి డాన్స్ చేసి ఆయనను మెప్పించాడు. అంతేకాదు.. చిరంజీవి స్ఫూర్తితోనే తాను హీరోనయ్యానంటూ మెగాస్టార్ ఎమోషనల్ అయ్యేలా మాట్లాడాడు.

అలాంటి కార్తికేయ ఈ నెల 21వ తేదీన వివాహం చేసుకున్నాడు. కాలేజ్ రోజుల్లో తాను ప్రేమించిన అమ్మాయినే పెళ్లాడుతున్నట్టుగా చెప్పాడు. ఈ వివాహానికి చిరంజీవికి కూడా హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఆ సందర్భంలోని ఒక ఫొటోను కార్తికేయ అభిమానులతో పంచుకున్నాడు.

చిన్నప్పుడు నేను తరచూ ఒక మాట అంటూ ఉండేవాడినట. "నేను పెద్దయ్యాక హీరోను అవుతాను. నా పెళ్లికి చిరంజీవి కూడా వస్తాడు" అనే వాడినట. విధి చాలా చిత్రమైనది.. నిజంగానే నేను హీరోనయ్యాను.. నా పెళ్లికి మెగాస్టార్ వచ్చారు. నా జీవితంలో నేను ఎప్పటికీ మరిచిపోలేని రోజు అది" అని చెప్పుకొచ్చాడు.
Go Back to Shorts
Chiranjeevi
Karthikeya
Tollywood

More Telugu News