Allu Arjun: ఫాంహౌస్‌లో భార్య‌తో క‌లిసి దీపావ‌ళి పార్టీ.. వీడియో పోస్ట్ చేసిన‌ అల్లు అర్జున్!

allu arjun video goes viral
షార్ట్స్‌లో చూడండి
సినీ హీరో అల్లు అర్జున్ ఇటీవ‌ల త‌న భార్య‌తో క‌లిసి దీపావ‌ళి వేడుక‌లో పాల్గొన్న వీడియోను తాజాగా పోస్ట్ చేశాడు. ఇందులో దంప‌తులు ఇద్ద‌రూ విద్యుత్ కాంతుల న‌డుమ మెరిసిపోతూ క‌న‌ప‌డుతున్నారు.  

ఫాంహౌస్‌ లో దీపావళి పార్టీ చేసుకున్నామ‌ని, ఈ అలంకరణకు కారణం త‌న భార్య‌ స్నేహనే అని బ‌న్నీ పేర్కొన్నాడు. తనే వ్యక్తిగత శ్రద్ధతో ఇలా చేయించిందని, ఇవి దీపావళి వైబ్స్ అని బ‌న్నీ చెప్పాడు. బ‌న్నీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియోను ఆయ‌న అభిమానులు షేర్ చేస్తున్నారు. బ‌న్నీ భార్య స్నేహారెడ్డి కూడా ఈ వీడియోను పోస్ట్ చేసింది.

కాగా, మెగా కుటుంబ స‌భ్యులతో బ‌న్నీ దీపావ‌ళి వేడుక‌ల్లో పాల్గొన్న ఫొటోలు కూడా ఇటీవ‌ల బాగా వైర‌ల్ అయిన విష‌యం తెలిసిందే. అల్లు అర్జున్- సుకుమార్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న‌ ‘పుష్ప’ సినిమా డిసెంబ‌ర్ 17న  విడుద‌ల కానున్న విష‌యం తెలిసిందే.
Go Back to Shorts
Allu Arjun
Tollywood
Viral Videos

More Telugu News