Keerti Suresh: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • అల్లు అర్జున్ కి జోడీగా కీర్తి సురేశ్?
  • మెగాస్టార్ తో త్రివిక్రమ్ సినిమా
  • మారేడుమిల్లి అడవుల్లో రవితేజ  
Keerti Suresh considered to be cast opposite Allu Arjun

*  ప్రస్తుతం 'పుష్ప' చిత్రంలో నటిస్తున్న అల్లు అర్జున్ దీని తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ భారీ చిత్రాన్ని చేయనున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇందులో కథానాయిక పాత్ర కోసం ప్రస్తుతం కీర్తి సురేశ్ తో సంప్రదింపులు జరుగుతున్నట్టు సమాచారం.
*  మెగాస్టార్ చిరంజీవి, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఓ సినిమా వస్తుందంటూ గత కొంత కాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి విదితమే. ఈ క్రమంలో తాజాగా ఈ ప్రాజక్టు ఓకే అయినట్టు తెలుస్తోంది. డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ నిర్మించే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడుతుంది.
*  రవితేజ హీరోగా శరత్ మండవ దర్శకత్వంలో రూపొందుతున్న 'రామారావు ఆన్ డ్యూటీ' చిత్రం షూటింగ్ నిన్నటి నుంచి తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి అడవుల్లో జరుగుతోంది. ఇక్కడ కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇక ఈ షెడ్యూలు తర్వాత పాటల చిత్రీకరణ కోసం యూనిట్ విదేశాలకు వెళుతుంది.

More Telugu News