మహా పాదయాత్ర నిర్వాహకులకు నోటీసులు ఇచ్చిన ప్రకాశం జిల్లా పోలీసులు
- అమరావతి కోసం రైతుల పాదయాత్ర
- ప్రకాశం జిల్లాలో ప్రవేశించిన పాదయాత్ర
- ఎక్కువ శబ్దం వచ్చే మైకులు వాడుతున్నారన్న పోలీసులు
- ఎక్కువమంది పాల్గొంటున్నారని ఆరోపణ
కాగా, పోలీసుల నోటీసులపై మహా పాదయాత్ర నిర్వాహకులు స్పందించారు. వారంలోగా నోటీసులపై వివరణ ఇస్తామని వెల్లడించారు. నేడు పాదయాత్ర గుంటూరు జిల్లా పెదనందిపాడు నుంచి ప్రకాశం జిల్లా పర్చూరు చేరుకుంది. రేపు రాత్రికి రైతులు ఇంకొల్లు చేరుకుంటారు. సోమవారం పాదయాత్రకు విరామం అని నిర్వాహకులు ప్రకటించారు.