Allu Arjun: 'పుష్ప'లో మంగళం శ్రీనుగా సునీల్ .. రేపు ఫస్టులుక్!

  • పాట చిత్రీకరణలో 'పుష్ప'
  • అడవి నేపథ్యంలో సాగే కథ 
  • ప్రతినాయకుడిగా ఫాహద్ ఫాజిల్
  • డిసెంబర్ 17వ తేదీన విడుదల
Pushpa movie update

అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్లో 'పుష్ప' సినిమా రూపొందుతోంది. కొన్ని రోజులుగా ఈ సినిమాకి సంబంధించిన పాటను చిత్రీకరిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి ఒక్కో అప్ డేట్ ను వదులుతూ వస్తున్నారు. రేపు ఈ సినిమా నుంచి సునీల్ ఫస్టులుక్ ను రిలీజ్ చేయనున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి అల్లు అర్జున్ సోలో .. రష్మిక సోలో .. ఇద్ది పై చిత్రీకరించిన డ్యూయెట్ ను వదిలారు. ఈ లిరికల్ సాంగ్స్ కి అనూహమైన రెస్పాన్స్ వచ్చింది. అలాగే బన్నీ లుక్ .. రష్మిక లుక్ ..  ఫాహద్ ఫాజిల్ లుక్ ను వదులుతూ వాళ్ల పాత్రలను పరిచయం చేశారు.

ఈ సినిమాలో సునీల్ 'మంగళం శ్రీను' అనే పాత్రను పోషించాడు. రేపు ఉదయం 10:08 నిమిషాలకు ఆయన ఫస్టులుక్ ను రిలీజ్ చేయనున్నారు. జగపతిబాబు .. ప్రకాశ్ రాజ్ కీలకమైన పాత్రలను పోషించిన ఈ సినిమాలో, అనసూయ ప్రత్యేకమైన పాత్రలో కనిపించనుంది. డిసెంబర్ 17వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

More Telugu News