బాలయ్యను ఢీకొట్టనున్న ఊరమాస్ విలన్!
- బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని మూవీ
- కథానాయికగా తెరపైకి శ్రుతి హాసన్ పేరు
- ఇతర నటీనటుల ఎంపిక పనిలో దర్శకుడు
- త్వరలో పట్టాలెక్కనున్న ప్రాజెక్టు
ఇక బాలయ్య సరసన నాయికగా ఇప్పటికే శ్రుతి హాసన్ ను ఎంపిక చేసినట్టుగా వార్తలు వచ్చాయి. మరో కథానాయికకు కూడా చోటు ఉందని అంటున్నారు. ప్రస్తుతం ఇతర నటీనటుల ఎంపిక జరుగుతోంది. ఇక ఈ సినిమాలో బాలకృష్ణతో తలపడే పవర్ఫుల్ విలన్ ను కన్నడ నుంచి దింపుతున్నట్టుగా సమాచారం .. ఆ విలన్ పేరే దునియా విజయ్.
కన్నడలో రౌడీ రోల్స్ ఎక్కువగా చేసిన విజయ్ .. 'దునియా' సినిమాతో హీరోగా మారాడు. అప్పటి నుంచి ఆ సినిమా పేరు ఆయన ఇంటి పేరుగా మారిపోయింది. బాలకృష్ణ సినిమా కోసం ఆయనను తీసుకున్నట్టుగా చెప్పుకుంటున్నారు. గతంలో కన్నడ నుంచి వచ్చిన ప్రభాకర్ .. దేవరాజ్ ఇక్కడ విలన్స్ గా రాణించిన సంగతి తెలిసిందే.