Karthikeya: రేపు 'రాజా విక్రమార్క' ప్రీ రిలీజ్ ఈవెంట్!

Raja Vikramarka Pre Release Event on 6th November
షార్ట్స్‌లో చూడండి
కార్తికేయ ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి వరుస సినిమాలు చేస్తూ వెళుతున్నాడు. అయితే ఆశించిన స్థాయిలో విజయాలు మాత్రం అందడం లేదు. ఈ క్రమంలో తాజాగా కొత్త దర్శకుడు శ్రీ సరిపల్లిని పరిచయం చేస్తూ, 'రాజా విక్రమార్క' సినిమాను చేశాడు.

రామారెడ్డి నిర్మించిన ఈ సినిమాలో కార్తికేయ సరసన నాయికగా తాన్య రవిచంద్రన్ నటించింది. తెలుగులో ఆమె చేస్తోన్న తొలి సినిమా ఇదే. ఈ సినిమాను ఈనెల 12వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేశారు. అందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ ను వదిలారు.

హైదరాబాద్ - ఫిల్మ్ నగర్లోని జెఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో రేపు సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుక మొదలుకానుంది. కాస్త కామెడీ .. మరికాస్త రొమాంటిక్ టచ్ ఉన్న యాక్షన్ సినిమా ఇది. కీలకమైన పాత్రల్లో సాయికుమార్ .. తనికెళ్ల భరణి కనిపించనున్నారు. ఈ సినిమాతోనైనా కార్తికేయకు హిట్ పడుతుందేమో చూడాలి. 
Go Back to Shorts
Karthikeya
Tanya Ravichandran
Sri Saripalli

More Telugu News