ఈ సమయంలో ఆ ఊసు ఎత్తకూడదు: పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్
- టీ20 వరల్డ్ కప్ లో భారత్ పై పాకిస్థాన్ విజయం
- చర్చలకు ఇది మంచి టైం కాదన్న ఇమ్రాన్ ఖాన్
- కశ్మీర్ లో హక్కుల గురించే ఆందోళన అని వ్యాఖ్య
- సమస్యను హుందాగా పరిష్కరించుకోవాలన్న ఇమ్రాన్
సౌదీ అరేబియా రాజధాని రియాద్ లో నిర్వహించిన పాకిస్థాన్–సౌదీ ఇన్వెస్ట్ మెంట్ ఫోరంలో ఆయన మాట్లాడారు. చైనాతో తమకు మంచి సంబంధాలున్నాయని, భారత్ తో కూడా సంబంధాలు బలపడితే భారత్, పాక్ రెండూ శక్తిమంతమైన దేశాలుగా ఎదుగుతాయని చెప్పారు. కశ్మీర్ ప్రజలకు 72 ఏళ్ల కిందట ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి కల్పించిన హక్కుల అమలు గురించే తమ ఆందోళనంతా అని అన్నారు. వారికి ఆ హక్కులిస్తే తమకు మాట్లాడాల్సిన అవసరమే లేదన్నారు.