ఏపీలో మరో 396 మందికి కరోనా పాజిటివ్
- గత 24 గంటల్లో 40,855 కరోనా పరీక్షలు
- చిత్తూరు జిల్లాలో 94 కొత్త కేసులు
- కర్నూలు జిల్లాలో నలుగురికి పాజిటివ్
- రాష్ట్రంలో ఆరుగురి మృతి
- ఇంకా 5,222 మందికి చికిత్స
అదే సమయంలో 566 మంది కరోనా నుంచి కోలుకోగా, ఆరుగురు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,63,177 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,43,616 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 5,222 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 14,339కి పెరిగింది.