మేక పాలతో డెంగ్యూ తగ్గుతుందంటూ ప్రచారం.. లీటర్ కు రూ.400 పెట్టినా దొరకని వైనం!
- రూ.30 నుంచి అమాంతం పెరిగిపోయిన ధర
- ప్లేట్ లెట్స్ పెరుగుతాయన్న గవర్నమెంట్ డాక్టర్
- మేకపాల కోసం ఎగబడుతున్న జనం
- మధ్యప్రదేశ్ లోని ఛత్తర్ పూర్ లో ఘటన
అనుకోకుండా పెరిగిన ఈ డిమాండ్ తో వ్యాపారులూ ధరలు బాగా పెంచేశారు. డెంగ్యూ వచ్చిన రోగులు మేక పాలు తాగితే మంచిదేగానీ.. అదే డెంగ్యూను పూర్తిగా తగ్గిస్తుందనుకోవడం మాత్రం పొరపాటని, మేకపాలు మంచివని చెప్పిన డాక్టర్ అభయ్ సింగ్ తెలిపారు. ప్రస్తుతం ఛత్తర్ పూర్ లో డెంగ్యూ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. జిల్లా ప్రభుత్వాసుపత్రిలోనే 20 దాకా కేసులున్నాయి. ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ జనం చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే జనాలు మేకపాలపై దృష్టి పెడుతున్నారు.