Andhra Pradesh: ఏపీలో మరో 493 మందికి కొవిడ్ పాజిటివ్

AP Covid Status Report
షార్ట్స్‌లో చూడండి
ఏపీలో గడచిన 24 గంటల్లో 41,820 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 493 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 113 కొత్త కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో 74, పశ్చిమ గోదావరి జిల్లాలో 66, కృష్ణా జిల్లాలో 56 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా అనంతపురం జిల్లాలో 6 కేసులు గుర్తించారు.

అదే సమయంలో 552 మంది కరోనా నుంచి కోలుకోగా, ఏడుగురు మరణించారు. తాజా మరణాలతో కలిపి కరోనా మృతుల సంఖ్య 14,327కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,62,303 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,42,476 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 5,500 మంది చికిత్స పొందుతున్నారు.
Go Back to Shorts
Andhra Pradesh
COVID19
Status Report
Daily Cases

More Telugu News