రాష్ట్ర రాజకీయ పరిణామాలపై స్పందించిన తమిళనాడు బీజేపీ చీఫ్
- తమిళ ప్రజలు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామన్న నైనార్ నాగేంద్రన్
- ఈ ఎన్నికల్లో ప్రజలు తమకు అవకాశం ఇవ్వలేదన్న బీజేపీ చీఫ్
- ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్న ఏ పార్టీకి మద్దతివ్వబోమన్న బీజేపీ
తమిళనాడులో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై ఆ రాష్ట్ర బీజేపీ స్పందించింది. 108 స్థానాలు గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించిన విజయ్, మెజారిటీ నిరూపించుకొని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు, డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాయనే ప్రచారం కూడా సాగుతోంది.
ద్రవిడ పార్టీల వెనుక బీజేపీ ఉందని కాంగ్రెస్ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ తమిళనాడు శాఖ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులపై స్పందించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల తీర్పును బీజేపీ స్వాగతిస్తోందని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రజలు బీజేపీకి ఎలాంటి అవకాశం ఇవ్వలేదని అంగీకరించారు.
తమిళ ప్రజల ఆకాంక్షలను, ఎన్నికల ద్వారా ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని పేర్కొన్నారు. అందుకే రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఏ ప్రయత్నంలోనూ తమ పాత్ర ఉండదని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు జరుగుతున్న ఆయా పార్టీల ప్రయత్నాలతో తమకు సంబంధం లేదని అన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్న ఏ పార్టీకీ తాము మద్దతివ్వడం లేదని, అలాగే వారి ప్రయత్నాలకు విఘాతం కలిగించడం లేదని నైనార్ నాగేంద్రన్ తెలిపారు.