నా బిడ్డ పాదయాత్ర చేస్తోంది... మీ అందరి ఆశీస్సులు కావాలి: వైఎస్ విజయమ్మ

YS Vijayamma seeks blessings to Sharmila
  • తెలంగాణలో షర్మిల రాజకీయ పార్టీ
  • రాజ్యాధికారమే లక్ష్యంగా ప్రస్థానం
  • ఈ నెల 20 నుంచి మరో ప్రజాప్రస్థానం పేరిట పాదయాత్ర
  • షర్మిలను తొలి అడుగు వేస్తోందన్న విజయమ్మ
తెలంగాణలో రాజకీయ పార్టీ (వైఎస్సార్ తెలంగాణ పార్టీ) ఏర్పాటు చేసిన వైఎస్ షర్మిల పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తన పార్టీ సత్తా ఏంటో నిరూపించుకోవాలని తహతహలాడుతున్న షర్మిల మరో ప్రజాప్రస్థానం పేరిట పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు. దీనిపై ఆమె తల్లి వైఎస్ విజయమ్మ ఓ వీడియో సందేశం వెలువరించారు.

తన బిడ్డ షర్మిల ఈ నెల 20న చేవెళ్ల నుంచి మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో తొలి అడుగు వేస్తోందని వెల్లడించారు. రాజశేఖర్ రెడ్డిని అభిమానించే ప్రతి ఒక్కరూ షర్మిలను ఆదరించాలని కోరారు. పాదయాత్ర సందర్భంగా ఆమె అడుగులో అడుగు వేయాలని, చేతిలో చేయి కలపాలని, రాజన్న సంక్షేమ రాజ్యాన్ని సాధించుకోవాలని విజయమ్మ పిలుపునిచ్చారు.
Go Back to Shorts
YS Vijayamma
YS Sharmila
Maro Praja Prasthanam
Padayatra
Chevella
YSR Telangana Party
Telangana

More Telugu News