‘జబర్దస్త్‌’ ప్రోగ్రాం నుంచి బాల‌కృష్ణ‌కు సినీన‌టి రోజా ఫోన్.. ఆస‌క్తిక‌ర సంభాష‌ణ‌!
Add ap7am to your home Screen

‘జబర్దస్త్‌’ ప్రోగ్రాం నుంచి బాల‌కృష్ణ‌కు సినీన‌టి రోజా ఫోన్.. ఆస‌క్తిక‌ర సంభాష‌ణ‌!

roja calls balakrishna
  • ప్ర‌స్తుతం అఖండ షూట్‌లో ఉన్నానని చెప్పిన బాల‌య్య‌
  • మళ్లీ మనిద్దరం కలిసి ఎప్పుడు సినిమా చేద్దామ‌ని బాల‌య్య‌కు రోజా ప్ర‌శ్న
  • ‘జబర్దస్త్‌’ ప్రోగ్రాంకు జడ్జీగా తాను వస్తానన్న‌ బాల‌కృష్ణ  
‘జబర్దస్త్‌’ ప్రోగ్రాం నుంచి నంద‌మూరి బాల‌కృష్ణ‌కు సినీన‌టి రోజా ఫోన్ చేసి మాట్లాడారు. ఇందుకు సంబంధించిన ప్రోమోను ఆ కార్య‌క్ర‌మ నిర్వాహ‌కులు విడుద‌ల చేశారు. ‘జబర్దస్త్‌’ వేదిక నుంచి బాల‌కృష్ణ‌కు రోజా ఫోన్ చేయ‌డంతో ఆ ప్రోగ్రాంలోని వారంతా సంబ‌ర‌ప‌డిపోయారు.

త‌మ‌ అందరి సమక్షంలో బాలకృష్ణకు కాల్‌ చేయండ‌ని రోజాను అనసూయ కోరింది. అయితే, బాల‌కృష్ణ ఈ స‌మ‌యంలో మంచి మూడ్‌లో ఉంటే ఓకే. లేకపోతే ఎలా? అని రోజా ప్ర‌శ్నిస్తూనే ఫోన్ చేసింది. బాలయ్య ఫోన్ ఎత్తారు.

దీంతో 'హలో సర్‌.. బాగున్నారా?' అని రోజా పలకరించారు. బదులిస్తూ 'రోజాగారు నమస్కారం' అన్నారు బాలకృష్ణ. తాను బాగున్నాన‌ని, మన అఖండ షూట్‌లో ఉన్నానని ఆయన చెప్పారు. మళ్లీ మనిద్దరం కలిసి ఎప్పుడు సినిమా చేద్దామ‌ని బాల‌య్య‌ను రోజా ప్ర‌శ్నించారు. 'భైరవద్వీపం పార్ట్ 2 చేద్దామా? లేక బొబ్బిలిసింహం పార్ట్ 2 చేద్దామా?' అన్నారు రోజా. దానికి బాలయ్య నవ్వుతూ, త‌మ‌ కాంబినేషన్‌ కోసం అందరూ ఎదురుచూస్తున్నారని చెప్పారు. ‘జబర్దస్త్‌’ ప్రోగ్రాంకు జడ్జీగా తాను వస్తానని బాల‌కృష్ణ అన‌డంతో అంద‌రూ ఖుషీ అయ్యారు.
     
Roja
Balakrishna
Tollywood

More Telugu News