Nani: విజయదశమి రోజున నాని కొత్త సినిమా ఎనౌన్స్ మెంట్!

  • నాని తాజా చిత్రంగా 'శ్యామ్ సింగ రాయ్'
  • సెట్స్ పైనే ఉన్న 'అంటే సుందరానికీ!'
  • కొత్త సినిమాకి సన్నాహాలు
  • కెరియర్ పరంగా నానీకి 29వ సినిమా  
Nani new movie Announcement on October 15th

నాని కథానాయకుడిగా ఇటీవల వచ్చిన 'టక్ జగదీష్' మరోసారి ఉమ్మడి కుటుంబాలను .. అప్పటి అనుబంధాలను కళ్లకు కట్టింది. ఆ తరువాత సినిమాగా ప్రేక్షకులను పలకరించడానికి 'శ్యామ్ సింగ రాయ్' రెడీ అవుతోంది. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, టైటిల్ .. లుక్ .. కథాకథనాల పరంగా కొత్తదనంతో కట్టిపడేయనుంది.

మరో ప్రాజెక్టుగా 'అంటే సుందరానికీ' లైన్లోనే ఉంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాతో తెలుగు తెరకి కథానాయికగా నజ్రియా నజీమ్ పరిచయమవుతోంది. ఈ నేపథ్యంలోనే నాని తన 29వ సినిమాను ప్రకటించడానికి రెడీ అవుతున్నాడు.

'విజయదశమి' పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని, ఈ నెల 15వ తేదీన మధ్యాహ్నం 1:53 నిమిషాలకు ఈ సినిమాను ప్రకటిస్తున్నట్టుగా ఒక పోస్టర్ ను వదిలారు. శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నట్టుగా ఈ పోస్టర్ ను బట్టి తెలుస్తోంది. ఇక ఆ రోజున ఈ సినిమాకి సంబంధించిన మిగతా వివరాలు .. విశేషాలు తెలిసే అవకాశం ఉంది.

More Telugu News