తెలంగాణలో గత 24 గంటల్లో 196 కరోనా కేసులు
- గత 24 గంటల్లో 44,310 కరోనా పరీక్షలు
- జీహెచ్ఎంసీ పరిధిలో 59 కేసులు
- రాష్ట్రంలో ఒకరి మృతి
- ఇంకా 4,190 మందికి చికిత్స
అదే సమయంలో 201 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,68,266 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,60,143 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,190 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,933కి పెరిగింది.
