Shiv Sena: ఆటోడ్రైవ‌ర్ల‌పై శివ‌సేన కార్య‌క‌ర్త‌ల దాడి.. వీడియో వైర‌ల్

shivsena workers create ruckus at thane
షార్ట్స్‌లో చూడండి
ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌ ఖేరిలో ఇటీవ‌ల రైతుల‌పై చోటుచేసుకున్న హింసాత్మక ఘటనకు నిరసన తెలుపుతూ మహారాష్ట్రలోని సంకీర్ణ ప్రభుత్వంలోని శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ నిన్న బంద్ కు పిలుపునివ్వ‌డంతో శివ‌సేన కార్య‌క‌ర్త‌లు రోడ్ల‌పై రెచ్చిపోతూ బంద్ ను విజ‌య‌వంతం చేయ‌డానికి ప్ర‌య‌త్నించారు. ఈ క్రమంలో థానే నగరంలో రోడ్ల‌పై ఆటో డ్రైవ‌ర్ల‌పై వారు దాడులు చేస్తుండ‌గా తీసిన వీడియోలు వైర‌ల్ అవుతున్నాయి.

ఆటో డ్రైవ‌ర్ల‌ను శివ‌సేన కార్య‌క‌ర్త‌లు క‌ర్ర‌ల‌తో కొట్టారు. ఓ నేత‌.. ఆటో డ్రైవ‌ర్ చెంపపై కూడా కొట్టారు. శివ‌సేన కార్య‌క‌ర్త‌లు ఆటోడ్రైవ‌ర్ల‌ను ల‌క్ష్యంగా చేసుకుని దాడులు చేయ‌డంతో ఆటో డ్రైవ‌ర్లు భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌య్యారు. మ‌రోవైపు, మ‌హారాష్ట్ర‌లో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. వ్యాపార, వాణిజ్య సముదాయాలు మూతబడ్డాయి.
Go Back to Shorts
Shiv Sena
Maharashtra
Viral Videos

More Telugu News