తెలంగాణలో గత 24 గంటల్లో 176 కరోనా కేసులు
Add ap7am to your home Screen

తెలంగాణలో గత 24 గంటల్లో 176 కరోనా కేసులు

Telangana corona report
  • రాష్ట్రంలో 37,857 కరోనా పరీక్షలు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 53 కొత్త కేసులు
  • రాష్ట్రంలో ఒకరి మృతి
  • ఇంకా 4,365 మందికి చికిత్స
తెలంగాణలో కరోనా వ్యాప్తి బాగా తగ్గుముఖం పట్టింది. గడచిన 24 గంటల్లో 37,857 కరోనా పరీక్షలు నిర్వహించగా, 176 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 53 కొత్త కేసులు నమోదు కాగా, కరీంనగర్ జిల్లాలో 14, రంగారెడ్డి జిల్లాలో 14, వరంగల్ అర్బన్ జిల్లాలో 11 కేసులు వెల్లడయ్యాయి. నారాయణపేట, కొమరంభీం ఆసిఫాబాద్, జోగులాంబ గద్వాల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.

అదే సమయంలో 216 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 6,67,334 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,59,043 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,365 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,926కి పెరిగింది.
Telangana
Corona Virus
Media Report
Today Cases

More Telugu News