‘ఇళ్లలో మగవారి వేధింపులే కారణం’.. ప్రత్యేకించి పలుకుబడి ఉన్న కుటుంబాలేనంటూ సమంత స్టైలిస్ట్ ప్రీతమ్ పోస్ట్!
- ఆ వెంటనే డిలీట్ చేసిన వైనం
- నిజస్వరూపాన్ని ఇళ్లలోనే దాచేస్తున్నారని కామెంట్
- మానసిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ పోస్ట్

అయితే, ఇప్పుడు సామ్ స్టైలిస్ట్ ప్రీతమ్ పెట్టిన పోస్ట్ ఒకటి వైరల్ గా మారింది. ఆ వెంటనే పోస్ట్ ను డిలీట్ చేసినా అప్పటికే అది చాలా మందికి చేరిపోయింది. ‘‘కొన్ని కుటుంబాలు కొంతమంది మగవారి నిజస్వరూపాన్ని ఇళ్లలోనే దాచేస్తున్నాయి. ప్రత్యేకించి సమాజంలో పలుకుబడి ఉన్న కుటుంబాలే అలా చేస్తున్నాయి. మహిళలపై హింసకు వారే బాధ్యులు. ఇప్పుడు వేధింపులు మానసిక రూపంలో జరుగుతున్నాయి. విమర్శల పేరిట సాగుతున్నాయి’’ అంటూ పోస్ట్ పెట్టాడు. అయితే, ఆ పోస్ట్ ను అతడు డిలీట్ చేశాడు.
పోస్ట్ లో సామ్, చైతూల పేర్లను ఎక్కడా పేర్కొనలేదు. అక్కినేని కుటుంబాన్నీ ప్రస్తావించలేదు. నెటిజన్లు మాత్రం ఇది కచ్చితంగా చైతూ–సామ్ విడాకులనుద్దేశిస్తూ పెట్టిన పోస్టేనని చర్చించుకుంటున్నారు. అసలు ఆ పోస్ట్ ఎందుకు పెట్టాడు? ఎందుకు తీసేశాడు? అన్న చర్చ జరుగుతోంది.