Raghavendra Rao: రాఘవేంద్రరావు హీరోగా రెండో సినిమా!

Radhavendra Rao another movie as a hero
షార్ట్స్‌లో చూడండి
తెలుగు సినిమాతో పరిచయం ఉన్నవారికి రాఘవేంద్రరావు పేరును ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. రొమాంటిక్ సాంగ్స్ ను చిత్రీకరించడంలో .. హీరోయిన్లను మరింత అందంగా చూపించడంలో ఆయన తరువాతే. అలాంటి రాఘవేంద్రరావు, భక్తి చిత్రాలతో సైతం ప్రేక్షకులను మెప్పించడం విశేషం.

కొంతకాలంగా మెగాఫోన్ పక్కన పెట్టేసిన ఆయన, 'పెళ్లి సందD' సినిమాలో నటుడిగా తెరపై తొలిసారి కనిపించనున్నారు. నటుడిగా ఆయన కనిపించనుండటమనేది ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలవనుంది. ఈ సినిమా ఈ నెల 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే రాఘవేంద్రరావు మరో సినిమాతో తెరపైకి రావడానికి ఎక్కువ సమయం తీసుకోవడం లేదు.

తనికెళ్ల భరణి దర్శకత్వంలో ఆయన ఒక సినిమా చేయనున్నారు. ఈ సినిమాలో ఆయనే ప్రధానమైన పాత్రధారిగా కనిపించనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు చకచకా జరిగిపోతున్నాయి. ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి ప్రయత్నాలు జరుగుతుండగానే, హీరోగా ఆయన మరో ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

దర్శకుడు వీఎన్ ఆదిత్య ఒక కథ వినిపించడం .. ప్రధానమైన పాత్రను పోషించడానికి ఆయన ఓకే చెప్పేయడం జరిగిపోయాయట. తనికెళ్ల భరణి సినిమా పూర్తయిన తరువాత, ఈ సినిమా పట్టాలెక్కనుందని అంటున్నారు. నటుడిగా ఈ సినిమాలు చేస్తూనే, ఆయన త్వరలో మళ్లీ మెగాఫోన్ పట్టనున్నట్టు చెబుతున్నారు.    
Go Back to Shorts
Raghavendra Rao
Tanikella Bharani
Adithya

More Telugu News