ఏపీలో మరో 765 మందికి కరోనా

AP Covid report
  • గత 24 గంటల్లో 45,481 కరోనా పరీక్షలు
  • చిత్తూరు జిల్లాలో 161 కొత్త కేసులు
  • అనంతపురం జిల్లాలో ఒకరికి పాజిటివ్
  • రాష్ట్రంలో 9 మంది మృతి
  • ఇంకా 10,357 మందికి చికిత్స
ఏపీలో గడచిన 24 గంటల్లో 45,481 కరోనా పరీక్షలు నిర్వహించగా, 765 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 161 కొత్త కేసులు నమోదయ్యాయి. మిగిలిన జిల్లాల్లో 100కి లోపే కేసులు వెల్లడయ్యాయి. తూర్పు గోదావరి జిల్లాలో 94, గుంటూరు జిల్లాలో 91, నెల్లూరు జిల్లాలో 91, పశ్చిమ గోదావరి జిల్లాలో 90 కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా అనంతపురం జిల్లాలో ఒక పాజిటివ్ కేసు గుర్తించారు.

అదే సమయంలో 973 మంది కరోనా నుంచి కోలుకోగా, 9 మంది మరణించారు. తాజా మరణాలతో కలిపి కరోనా మృతుల సంఖ్య 14,204కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటిదాకా 20,52,763 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,28,202 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 10,357 మంది చికిత్స పొందుతున్నారు.
Go Back to Shorts
Andhra Pradesh
COVID19
Today Cases
Deaths

More Telugu News