car: నిర్ల‌క్ష్యంగా కారును యూట‌ర్న్ తీసుకున్న డ్రైవ‌ర్.. బైకుపై వెళ్తూ ఢీ కొట్టిన యువ‌కుడి మృతి.. వీడియో ఇదిగో

  • ముంబైలో ఘ‌ట‌న‌
  • కారు డ్రైవ‌ర్ ప‌రారీ
  • గాలించి ప‌ట్టుకున్న పోలీసులు
Car takes sudden u turn on Mumbai road one dead

ఓ కారు డ్రైవ‌ర్ నిర్ల‌క్ష్యం కార‌ణంగా ద్విచ‌క్ర వాహ‌న‌దారుడు ప్రాణాలు కోల్పోయాడు. మ‌హారాష్ట్ర రాజ‌ధాని ముంబైలోని లోయ‌ర్‌ పారెల్ ఫ్లైఓవ‌ర్‌పై చోటు చేసుకున్న‌ ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన దృశ్యాలు అక్క‌డి సీసీటీవీ కెమెరాలో రికార్డ‌య్యింది. ఫ్లైఓవ‌ర్ పై నిర్ల‌క్ష్యంగా యూట‌ర్న్ తీసుకునేందుకు కారు డ్రైవ‌ర్ తన కారును ఒక్క‌సారిగా టర్న్ తీసుకున్నాడు. దీంతో ఆ స‌మ‌యంలో ఎదురుగా వ‌స్తోన్న ద్విచ‌క్ర వాహ‌న‌దారుడు.. ఆ కారు వెన‌క‌భాగాన్ని ఢీ కొట్టాడు.

మ‌రో ద్విచ‌క్ర వాహ‌న‌దారుడిని కూడా ఆ బైక్ ఢీకొట్టింది. అనంత‌రం వెంట‌నే కారు డ్రైవ‌రు ప‌రార‌య్యాడు. ఈ ప్ర‌మాదంలో మృతి చెందిన వ్య‌క్తి పేరు భ‌వేశ్ అరుణ్ (25) అని పోలీసులు గుర్తించారు. ఈ ఘ‌ట‌న‌లో మ‌రో ద్విచ‌క్ర వాహ‌న‌దారుడికి తీవ్ర‌గాయాల‌య్యాయి. అత‌డికి ప్ర‌స్తుతం ఆసుప‌త్రిలో చికిత్స అందుతోంది. ఈ ప్ర‌మాదంపై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు కారు డ్రైవ‌రును గాలించి అరెస్టు చేసి, త‌దుప‌రి వి‌చార‌ణ జ‌రుపుతున్నారు.

More Telugu News