చిరుత‌తో పోరాడి ప్రాణాలు కాపాడుకున్న బామ్మ‌.. వీడియో వైర‌ల్

woman fights with leopard
  • ముంబైలో ఘ‌ట‌న‌
  • చిరుత పులి ఉంద‌ని తెలియ‌క వ‌చ్చి అరుగుపై కూర్చున్న బామ్మ‌
  • దాడి చేయ‌బోయిన చిరుత 
స‌రిగ్గా న‌డ‌వ‌డానికి కూడా శ‌రీరం స‌హ‌క‌రించ‌ట్లేదు ఆ బామ్మ‌కు. అయిన‌ప్ప‌టికీ చేతి క‌ర్ర సాయంతో ఓ చిరుత‌ను ఎదిరించి త‌న ప్రాణాలు కాపాడుకుంది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో సీసీటీవీ కెమెరాలో రికార్డ‌యింది. మ‌హారాష్ట రాజ‌ధాని ముంబైలోని ఆరె ప్రాంతంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

ఆ ప్రాంతంలో ఓ చిరుతపులి సంచ‌రిస్తోంది. అక్క‌డ చిరుత ఉంద‌ని గుర్తించ‌కుండా ఓ బామ్మ‌ అరుగు వ‌ద్ద‌కు వ‌చ్చి కూర్చుంది. ఆ వెంట‌నే ఆమె వ‌ద్ద‌కు చిరుత వ‌చ్చి దాడి చేయ‌బోయింది. దీంతో ఆ బామ్మ త‌న చేతి క‌ర్ర‌ను తీసుకుని దానిపై ఎదురుదాడికి దిగి కేక‌లు వేసింది. దీంతో చిరుత అక్క‌డి నుంచి వెళ్లిపోయింది. ఆమె కేకలు విన్న స్థానికులు వ‌చ్చి బామ్మను ఇంట్లోకి తీసుకెళ్లారు.
Go Back to Shorts
leopard
Viral Videos
Maharashtra

More Telugu News