కొత్త సినిమా కోసం మూడు విభిన్నమైన గెటప్పుల్లో బాలకృష్ణ!
- గోపీచంద్ మలినేనితో బాలకృష్ణ
- మాస్ అంశాలతో సాగే కథ
- త్వరలో రెగ్యులర్ షూటింగ్ మొదలు
- లైన్లో అనిల్ రావిపూడి
ఇక ఆ తరువాత సినిమాను అనిల్ రావిపూడితో చేయనున్నాడని కొందరు అంటుంటే, గోపీచంద్ మలినేనితో సెట్స్ పైకి వెళ్లనున్నాడని మరి కొందరు చెబుతున్నారు. ఈ సినిమాకి సంబంధించిన పనులలోనే గోపీచంద్ మలినేని ఉన్నాడని అంటున్నారు. ఈ సినిమాలో ఆయన బాలకృష్ణను మూడు విభిన్నమైన గెటప్పులలో చూపించనున్నాడట.
మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించే ఈ సినిమాలో కథానాయికగా ఇలియానాను గానీ .. త్రిషను గాని తీసుకునే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. మొదటి నుంచి కూడా బాలకృష్ణకి మాస్ ఇమేజ్ ఎక్కువ. మాస్ ఆడియన్స్ ఆశించే అంశాలు ఈ సినిమాలో పుష్కలంగా ఉంటాయని చెబుతున్నారు.