నెట్ ఫ్లిక్స్ కి 'శ్యామ్ సింగ రాయ్' డిజిటల్ రైట్స్!

Shyam Singha Roy movie update
  • డిఫరెంట్ కాన్సెప్ట్ తో 'శ్యామ్ సింగ రాయ్'
  • నాని సరసన ముగ్గురు నాయికలు
  • సంగీత దర్శకుడిగా మీక్కీ జె మేయర్
  • త్వరలోనే ప్రేక్షకుల ముందుకు      
నాని - రాహుల్ సాంకృత్యన్ కాంబినేషన్లో 'శ్యామ్ సింగ రాయ్' రూపొందింది. వెంకట్ బోయినపల్లి నిర్మించిన ఈ సినిమా, ఇటీవలే షూటింగును పార్టును పూర్తిచేసుకుంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. డిఫరెంట్ లుక్ తో నాని కనిప్పించనున్న ఈ సినిమా నుంచి, త్వరలో విడుదల తేదీ ప్రకటన రానుంది.

నాని సరసన నాయికలుగా సాయిపల్లవి .. కృతి శెట్టి .. మడోన్నా సెబాస్టియన్ అలరించనున్నారు. ఈ ముగ్గురు పాత్రలకి కూడా ప్రాధాన్యత ఉంటుందని చెబుతున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతాన్ని అందించిన ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను, నెట్ ఫ్లిక్స్ వారు భారీరేటుకు దక్కించుకున్నట్టుగా తెలుస్తోంది.

ముందుగా ఈ సినిమా థియేటర్లకే రానుంది .. ఆ తరువాత నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా కోసం పది ఎకరాలో సెట్స్ వేసి మేజర్ పార్టును అందులోనే చిత్రీకరించారు. ఇటీవల వచ్చిన నాని 'టక్ జగదీష్' యావరేజ్ అనిపించుకుంది. మరి 'శ్యామ్ సింగ రాయ్' తో హిట్ కొడతాడేమో చూడాలి.
Go Back to Shorts
Nani
Sai Pallavi
Krithi Shetty
Madonna

More Telugu News