Anasuya: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • సంపత్ నంది సినిమాలో అనసూయ 
  • డిసెంబర్ నుంచి చైతూ ఓటీటీ సీరీస్
  • దర్శకుడిగా మారిన సంగీత దర్శకుడు  
Sampath Nandi to direct Anasuya

*  తాజాగా 'సీటీమార్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన దర్శకుడు సంపత్ నంది తన తదుపరి చిత్రాన్ని ప్రారంభించారు. హీరోయిన్ ఓరియెంటెడ్ కథాంశంతో రూపొందే ఈ చిత్రంలో ప్రధాన పాత్రను యాంకర్ అనసూయ పోషిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో ప్రకటిస్తారు.
*  అక్కినేని నాగ చైతన్య తొలిసారిగా ఓటీటీ సీరీస్ లో నటిస్తున్నాడు. విక్రంకుమార్ దర్శకత్వం వహించే ఈ సీరీస్ హారర్ కథాంశంతో రూపొందుతుంది. దీని షూటింగ్ డిసెంబర్లో మొదలవుతుందని తెలుస్తోంది. అమెజాన్ ప్రైమ్ ఈ సీరీస్ ను నిర్మిస్తుంది.
*  గతంలో 'గులాబి', 'సముద్రం' వంటి చిత్రాలకు సంగీతాన్ని సమకూర్చిన శశిప్రీతం ఇప్పుడు దర్శకుడిగా మారారు. 'లైఫ్ ఆఫ్ 3' పేరిట రూపొందిన ఈ చిత్రానికి శశిప్రీతం దర్శకత్వం వహించడంతో పాటు సంగీతాన్ని, కథ, స్క్రీన్ ప్లేను కూడా సమకూర్చారు. మరో విశేషం ఏమిటంటే, ఈ చిత్రాన్ని ఆయన కుమార్తె ఐశ్వర్య కృష్ణప్రియ నిర్మిస్తున్నారు.

More Telugu News