డ్ర‌గ్స్ కేసు: విచార‌ణ‌కు వ‌చ్చిన సినీ న‌టుడు న‌వ‌దీప్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

డ్ర‌గ్స్ కేసు: విచార‌ణ‌కు వ‌చ్చిన సినీ న‌టుడు న‌వ‌దీప్

trail in drugs case ed questions navdeep
  • డ్ర‌గ్స్ కేసులో లావాదేవీల‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచార‌ణ‌
  • కెల్విన్ ఇచ్చిన స‌మాచారం ఆధారంగా ప్ర‌శ్న‌లు
  • న‌వ‌దీప్‌కు సంబంధించిన‌ బ్యాంకు ఖాతాల ప‌రిశీల‌న‌
టాలీవుడ్‌లో డ్రగ్స్ వ్యవహారంలో జ‌రిగిన లావాదేవీల‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు విచార‌ణ జ‌రుపుతోన్న విష‌యం తెలిసిందే. డ్రగ్స్‌ కేసులో నిందితుడు కెల్విన్ ఇచ్చిన స‌మాచారం ఆధారంగా ఇప్ప‌టికే అధికారులు టాలీవుడ్ ప్ర‌ముఖులు పూరి జగన్నాథ్, చార్మి, ర‌కుల్ ప్రీత్ సింగ్, నందు, రానా, ర‌వితేజ‌ను విచారించారు.

ఇదే కేసులో నోటీసులు అందుకున్న సినీన‌టుడు న‌వ‌దీప్‌ ఈ రోజు ఈడీ అధికారుల ముందు విచార‌ణ‌కు హాజ‌ర‌య్యాడు. మూడు రోజుల విరామం అనంత‌రం ఈడీ అధికారులు ఈ కేసులో మ‌ళ్లీ విచార‌ణ కొన‌సాగిస్తున్నారు. గ‌త 10 రోజులుగా ఈ కేసులో విచార‌ణ కొన‌సాగుతోన్న విష‌యం తెలిసిందే.

రోజుకి ఒక‌రిని కార్యాల‌యానికి పిలిచి అధికారులు ప్ర‌శ్నిస్తున్నారు. డ్ర‌గ్స్‌కు సంబంధించిన లావాదేవీలు ఏ విధంగా జ‌రిగాయ‌న్న విష‌యంపై అధికారులు విచారించ‌నున్నారు. న‌వ‌దీప్‌కు సంబంధించిన‌ బ్యాంకు ఖాతాల‌ను అధికారులు ప‌రిశీలిస్తున్నారు. అలాగే, డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రాదారుల‌తో ఆయ‌న‌కు ఉన్న సంబంధాలు, అత‌డితో జ‌రిపిన సంప్ర‌దింపుల‌పై ఆరా తీస్తున్నారు.  
navdeep
drugs
Hyderabad
Tollywood

More Telugu News