Nagachaitanya: విక్రమ్ కుమార్ హారర్ వెబ్ సిరీస్ లో చైతూ!

 Nagachaitanya Web Series in Vikram Kumar
షార్ట్స్‌లో చూడండి
దర్శకుడు విక్రమ్ కుమార్ కి ఓ ప్రత్యేకత వుంది. తన సినిమాలు మంచి విజయాలు సాధించినా పెద్దగా హడావిడి చేయకుండా.. సైలెంటుగా తదుపరి సినిమా చేసుకుంటూ వెళుతుంటాడు. ఈ క్రమంలో ప్రస్తుతం చైతూ కథానాయకుడిగా ఆయన 'థ్యాంక్యూ' సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమా ఇప్పటికే చాలా వరకూ చిత్రీకరణ జరుపుకుంది. ఈ సినిమా తరువాత చైతూతో ఆయన ఒక వెబ్ సిరీస్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ ఏడాదిలోనే ఈ వెబ్ సిరీస్ పట్టాలెక్కుతుందని అంటున్నారు. ఇది హారర్ నేపథ్యంలో సాగే వెబ్ సిరీస్ కావడమే అసలు విషయం.

హారర్ కథలను హ్యాండిల్ చేయడంలో విక్రమ్ కుమార్ చేయితిరిగినవాడే. తమిళంలో ఆయన చేసిన హారర్ థ్రిల్లర్ '13 B' వివిధ భాషల్లో విజయవంతమైంది. మాధవన్ కెరియర్లోనే ప్రత్యేక చిత్రంగా నిలిచింది. తనకి హారర్ సినిమాలంటే భయమన్న చైతూ, ఈ వెబ్ సిరీస్ లో ఎలా చేస్తాడో చూడాలి.  
Go Back to Shorts
Nagachaitanya
Vikram Kumar
Thank You Movie

More Telugu News