నకిలీ కరోనా వ్యాక్సిన్లపై రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్ర ప్రభుత్వం
- అంతర్జాతీయ మార్కెట్లో కొవిషీల్డ్ ఫేక్ వ్యాక్సిన్లు
- ఆందోళన వ్యక్తం చేసిన డబ్ల్యూహెచ్ఓ
- రాష్ట్రాలకు లేఖ రాసిన కేంద్రం
- నకిలీల గుర్తింపునకు మార్గదర్శకాలు
ప్రస్తుతం భారత్ లో కొవిషీల్డ్, కొవాగ్జిన్, స్పుత్నిక్-వి వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ మూడింటికి సంబంధించి అసలైన వ్యాక్సిన్లను గుర్తించడంపై రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ లేఖ రాసింది. దేశంలో నకిలీ వ్యాక్సిన్లను గుర్తించేందుకు విచారణ చేపట్టినట్టు కేంద్ర ఆరోగ్యమంత్రి ముఖేశ్ మాండవీయ వెల్లడించారు.