Corona Virus: దేశంలో క‌రోనా కేసుల అప్‌డేట్స్‌

  • నిన్న కొత్తగా 42,766 క‌రోనా కేసులు
  • క‌రోనా కేసుల సంఖ్య మొత్తం 3,29,88,673
  • మ‌రో 308 మంది మృతి
  • మొత్తం మృతుల సంఖ్య 4,40,533
corona bulletin in inida

దేశంలో నిన్న కొత్తగా 42,766 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది. దీంతో దేశంలో క‌రోనా కేసుల సంఖ్య మొత్తం 3,29,88,673కి చేరింది. అలాగే, నిన్న 38,091మంది కోలుకున్నార‌ని పేర్కొంది. దేశంలో క‌రోనాతో మ‌రో 308 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 4,40,533కి పెరిగింది. రిక‌వ‌రీ రేటు 97.42 శాతంగా ఉంది.

ఇక క‌రోనా నుంచి ఇప్ప‌టివ‌ర‌కు 3,21,38,092 మంది కోలుకున్నారు. 4,10,048 మందికి ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్‌ల‌లో చికిత్స అందుతోంది. దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 68,46,69,521 డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు. నిన్న ఒక్క రోజే 71,61,760 డోసులు వేశారు. మరోపక్క, నిన్న ఒక్క‌ కేర‌ళ‌లోనే 29,682 కేసులు న‌మోదు కాగా, ఆ రాష్ట్రంలో 142 మంది ప్రాణాలు కోల్పోయారు.

More Telugu News