Nani: 'టక్ జగదీష్' నుంచి సాంగ్ రిలీజ్!

  • నాని నుంచి 'టక్ జగదీశ్'
  • కొత్తగా యాడ్ చేసిన బిట్ సాంగ్
  • యాక్షన్ నేపథ్యరంలో సాగే బీట్
  • ఈ నెల 10 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్  
Tuck Jagadish lyrical song released

నాని హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో 'టక్ జగదీష్' సినిమా రూపొందింది. ఈ సినిమా ఈ నెల 10వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ జరుపుకోనుంది. తమన్ బాణీలను అందించిన ఈ సినిమాకి గోపీసుందర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేశాడు. ఈ  నేపథ్యంలో ఈ సినిమా నుంచి వదిలిన ట్రైలర్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది.

అయితే నానిపై ఒక బిట్ సాంగ్ ఉంటే బాగుంటుందని భావించిన శివ నిర్వాణ, గోపీసుందర్ తో ఆ పాటకి ట్యూన్ చేయించారు. ఈ పాటను శివ నిర్వాణ స్వయంగా రాసి ఆయనే పాడటం విశేషం. 'సల్లాటి కుండలో సల్ల సక్క మనసువాడు. నువ్వు గిల్లి గిచ్చి రెచ్చగొడితే వచ్చి దంచుతాడు' అంటూ అంటూ ఈ పాట సాగుతోంది.

ఈ పాట సాహిత్యం చూస్తుంటే నాని యాక్షన్ సీన్స్ పై దీనిని ప్లే చేస్తారని అనిపిస్తోంది. బీట్ బాగుంది .. యాక్షన్ సీన్స్ ను  ఈ పాట మరో స్థాయికి తీసుకెళుతుంది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథలో. తన తండ్రి ఆశయాన్ని నెరవేర్చే తనయుడిగా నాని కనిపించనున్నాడు. ఆయన అన్నయ్య పాత్రలో జగపతిబాబు కనిపించనున్నాడు.

More Telugu News