Nagashourya: 'వరుడు కావలెను' నుంచి టీజర్ రిలీజ్!

Varudu Kaavalenu teaser released
షార్ట్స్‌లో చూడండి
నాగశౌర్యకి యూత్ లోను .. ఫ్యామిలీ ఆడియన్స్ లోను మంచి క్రేజ్ ఉంది. ప్రస్తుతం ఆయన చేతిలో అరడజను తెలుగు సినిమాలు ఉన్నాయి. వాటిలో 'వరుడు కావలెను' ఒకటి. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమాకి లక్ష్మీసౌజన్య దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో కథానాయికగా రీతూ వర్మ సందడి చేయనుంది.

తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు. నాయకా నాయికలకి సంబంధించిన సన్నివేశాలపై కట్ చేసిన ఈ టీజర్ బావుంది. అందం .. ఆత్మాభిమానం .. కాస్త అహంభావం ఉన్న పాత్రలో రీతూ వర్మ పాత్రను చూపించనున్నట్టు అర్థమవుతోంది. సహనంతో ఆమెను లైన్లో పెట్టే పనిలో ఉన్నవాడిగా కథానాయకుడు కనిపిస్తున్నాడు.

"ఆ అందం .. ఆ పొగరు .. ఆర్డర్ ఇచ్చి చేయించినట్టుగా ఉంది" .. "మీ బాస్ ఏంటి భయ్యా ఎడారిలో ఐస్ తయారు చేద్దామని చూస్తున్నాడు" అనే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. నదియా .. వెన్నెల కిషోర్ .. మురళీశర్మ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. అక్టోబర్లో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.
Go Back to Shorts
Nagashourya
Ritu Varma

More Telugu News