నా పాత స్నేహితుడ్ని కలుసుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది: చిరంజీవి
- హైదరాబాదులో విందు కార్యక్రమం
- ఫలక్ నుమా ప్యాలెస్ లో కలుసుకున్న చిరు, కపిల్
- పాత స్మృతుల్లోకి వెళ్లిన చిరు
- కపిల్ పై ప్రశంసలు
"చాలాకాలం తర్వాత నా పాతమిత్రుడు కపిల్ దేవ్ తో అద్భుతమైన భేటీ జరిగింది. ఎంతో ప్రాశస్త్యం ఉన్న ఫలక్ నుమా ప్యాలెస్ లో మేం కలుసుకోవడం మరింత ప్రత్యేకత చేకూర్చిపెట్టింది. ఒక్కసారి జ్ఞాపకాల్లోకి వెళ్లి వివిధ దశల్లో మా ప్రస్థానాన్ని గుర్తుచేసుకున్నాం. ఆనాటి మధుర స్మృతులను నెమరువేసుకున్నాం. కపిల్ దేవ్ నిజంగానే హర్యానా హరికేన్. మనకు తొలి వరల్డ్ కప్ అందించిన యోధుడు" అని పేర్కొన్నారు. కాగా ఈ కార్యక్రమంలో చిరంజీవి అర్ధాంగి సురేఖ కూడా పాల్గొన్నారు.

