drig: డ్ర‌గ్స్ కేసులో బాలీవుడ్‌ నటుడు అర్మాన్‌ కోహ్లీ అరెస్ట్

  • నిన్న అధికారుల‌కు చిక్కిన డ్రగ్స్‌ సరఫరదారుడు అజయ్‌ రాజు సింగ్
  • అత‌డిని విచారించ‌డంతో అర్మాన్ కోహ్లీ పేరు వెల్ల‌డి
  • కాసేప‌ట్లో కోర్టులో ప్ర‌వేశ‌పెట్ట‌నున్న ఎన్సీబీ అధికారులు
arman kohli arrested  by police

డ్ర‌గ్స్ కేసులో బాలీవుడ్‌ నటుడు అర్మాన్‌ కోహ్లీ అరెస్ట‌య్యాడు. నిన్న‌ డ్రగ్స్‌ సరఫరదారుడు అజయ్‌ రాజు సింగ్ నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ) అధికారులకు చిక్కడంతో అత‌డిని పోలీసులు విచారించారు. లభించిన ప్రాథమిక ఆధారాలతో అర్మాన్‌ కోహ్లీ ఇంటిపై నిన్న అధికారులు దాడి చేయ‌డంతో అక్కడ కొకైన్ లభ్య‌మైంది.

దీంతో అర్మాన్‌ కోహ్లీని కూడా ముంబైలోని ఎన్‌సీబీ కార్యాలయానికి తరలించి విచారించారు. ఈ రోజు ఆయ‌న‌ను అరెస్టు చేశారు. కాసేప‌ట్లో  కోర్టుముందు ప్రవేశపెట్టనున్నారు.  సల్మాన్‌ ఖాన్‌ నటించిన ప్రేమ్‌ రతన్‌ ధన్‌పాయో సినిమాలో అర్మాన్ న‌టించి గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే,  హిందీ బిగ్‌ బాస్‌లోనూ అర్మాన్‌ కోహ్లీ పాల్గొన్నాడు. ఆయ‌న‌కు దక్షిణ అమెరికా దేశాల నుంచి డ్ర‌గ్స్ అందిన‌ట్లు అధికారులు తేల్చారు.

More Telugu News