Allu Arjun: 'పుష్ప' నుంచి విలన్ ఫస్టులుక్ రిలీజ్!

  • ముగింపు దశలో 'పుష్ప'
  • ఐపీఎస్ ఆఫీసర్ గా ఫాహద్ ఫాజిల్
  • డిఫరెంట్ గా డిజైన్ చేసిన విలన్ పాత్ర 
  • క్రిస్మస్ కి సినిమా విడుదల  
Pushpa Villain first look released

అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్లో 'పుష్ప' సినిమా రూపొందుతోంది. చిత్రీకరణపరంగా ఈ సినిమా ముగింపు దశకి చేరుకుంది. అడవి నేపథ్యంలో .. ఎర్రచందనం అక్రమ రవాణా చుట్టూ ఈ కథ తిరుగుతుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్టు సింగిల్ కొత్త రికార్డులను నమోదు చేస్తోంది.

రష్మిక కథానాయికగా నటించిన ఈ సినిమాలో, ప్రతినాయకుడిగా మలయాళ స్టార్ ఫాహద్ ఫాజిల్ నటిస్తున్నాడు. ఇటీవలే ఆయన ఈ సినిమా షూటింగులో జాయిన్ అయ్యాడు. తాజాగా ఆయన ఫస్టులుక్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో ఆయన ఐపీఎస్ భన్వర్ సింగ్ షెకావత్ గా కనిపించనున్నాడనే విషయం ఈ పోస్టర్ ద్వారా తెలుస్తోంది.
 
ఈ పాత్రలో ఫాహద్ ఫాజిల్ నున్నటి గుండుతో కొత్త లుక్ తో కనిపిస్తున్నాడు. ఈ లుక్ ను చూస్తుంటేనే ఆయన పాత్రను చాలా డిఫరెంట్ గా డిజైన్ చేశారనే విషయం అర్థమవుతోంది. ఆయన పాత్ర ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. క్రిస్మస్ కి ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

More Telugu News