గన్నవరం ఎయిర్ పోర్టులో తొలిసారిగా ల్యాండైన 'ఎయిరిండియా వన్'
- రాష్ట్రపతి తదితరుల కోసం 'ఎయిరిండియా వన్'
- బోయింగ్-777 విమానంలో సకల హంగులు
- దేశంలోని పలు విమానాశ్రయాల్లో ట్రయల్ ల్యాండింగ్
- విజయవాడ వచ్చిన ఎయిరిండియా వన్
- ల్యాండింగ్, టేకాఫ్ విజయవంతం
అయితే ఇది భారీ విమానం కావడంతో, ఎలాంటి ఇబ్బందులు లేకుండా దిగేందుకు వీలున్న విమానాశ్రయాలను గుర్తిస్తున్నారు. ఈ క్రమంలో బోయింగ్-777 విజయవాడలోని గన్నవరం ఎయిర్ పోర్టుకు వచ్చింది. ఇక్కడి రన్ వేపై విజయవంతంగా ల్యాండైంది. అనంతరం ఎలాంటి అవాంతరాలు లేకుండా సులువగా టేకాఫ్ తీసుకుంది. గతంలో గన్నవరం ఎయిర్ పోర్టు రన్ వే 7,500 అడుగుల విస్తీర్ణంలో ఉండగా, ఇటీవల దాన్ని 11,023 అడుగులకు పెంచారు.