Yahoo: వార్తా సేవలు నిలిపివేసిన 'యాహూ'

Yahoo halts news service
షార్ట్స్‌లో చూడండి
యాహూ... భారత్ లో ఇంటర్నెట్ రంగప్రవేశం చేసిన తొలినాళ్లలో ఎక్కువగా వినిపించిన పేరు. ఆ తర్వాత గూగుల్ రాకతో యాహూ కొంచెం వెనుకబడినా ఇప్పటికీ కార్యకలాపాలు కొనసాగిస్తూనే ఉంది. భారత్ లో యాహూ సేవల్లో వార్తలు కూడా ముఖ్యమైన అంశం. గత రెండు దశాబ్దాలుగా యాహూ న్యూస్ పేరిట వార్తలు అందిస్తోంది. అయితే, ఈ ఐటీ దిగ్గజం తాజాగా తన వార్తా సేవలు నిలిపివేసింది.

ఇవాళ్టి నుంచి యాహూ న్యూస్ కు స్వస్తి పలుకుతున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. అందుకు తగ్గట్టుగానే యాహూ న్యూస్ లో ఎలాంటి తాజా కంటెంట్ ను పోస్టు చేయలేదు. అయితే యాహూ మెయిల్, సెర్చ్ సేవలు యథాతథంగా కొనసాగుతాయని యాహూ వెల్లడించింది. తమ వినియోగదారులకు ఎలాంటి అసౌకర్యం కలగదని స్పష్టం చేసింది.

యాహూ తాజా నిర్ణయానికి భారత కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలేనని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. డిజిటల్ మీడియా సంస్థల్లో విదేశీ సంస్థల పెట్టుబడులను 26 శాతం వరకే అనుమతిస్తుండడం యాహూ వెనుకంజకు కారణంగా తెలుస్తోంది. దానికితోడు విదేశీ మీడియా సంస్థలపై బారత నియంత్రణ చట్టాల ప్రభావం అధికం కానుంది.
Go Back to Shorts
Yahoo
News
Service
India

More Telugu News