బ్లాక్ వాటర్ తాగుతున్న విరాట్ కోహ్లీ

Virat Kohli drinking black water
  • ఫ్రాన్స్ నుంచి దిగుమతి అవుతున్న బ్లాక్ వాటర్
  • లీటర్ వాటర్ ధర రూ. 3 నుంచి 4 వేలు
  • కరోనా ప్రారంభం నుంచి బ్లాక్ వాటర్ తాగడం మొదలుపెట్టన కోహ్లీ
ఫిట్ నెస్ కి, ఆరోగ్యానికి టీమిండియా కెప్లెన్ విరాట్ కోహ్లీ అత్యంత ప్రాధాన్యతను ఇస్తాడనే విషయం తెలిసిందే. ఫిట్ నెస్ కోసం తన డైట్ ను కూడా కోహ్లీ మార్చుకున్నాడు. కేవలం ఆహారం విషయంలోనే కాకుండా, మంచినీటి విషయంలో కూడా ఆయన ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

ఈ క్రమంలో మినరల్ వాటర్ కి బదులు 'బ్లాక్ వాటర్' తీసుకుంటున్నాడు. ఈ వాటర్ ఫ్రాన్స్ నుంచి దిగుమతి అవుతుందట. కరోనా ప్రారంభం నుంచి కోహ్లీ ఈ వాటర్ తాగడం మొదలు పెట్టాడు. మినరల్ వాటర్ లీటర్ రూ. 20 నుంచి రూ. 40 వరకు ఉండగా... బ్లాక్ వాటర్ లీటర్ ధర రూ. 3 వేల నుంచి రూ. 4 వేల వరకు ఉంటుందట.

బ్లాక్ వాటర్ లో నేచురల్ ఆల్కలైన్ ఉంటుందట. ఆల్కలైన్ వ్యక్తి శరీరాన్ని ఫిట్ గా, హైడ్రేటెడ్ గా ఉంచుతుందట. దీనివల్ల జీర్ణప్రక్రియ, రోగనిరోధక వ్యవస్థ మెరుగుపడుతుందట. మనం తాగే నీటిలో పీహెచ్ స్థాయి 7గా ఉంటే... బ్లాక్ వాటర్ లో 7 కంటే ఎక్కువ ఉంటుందట. ఈ వాటల్ లో యాంటీ ఏజింగ్ గుణాలు కూడా ఉంటాయట. అంటే మన చర్మం యవ్వనంగా ఉండేందుకు తోడ్పడుతుందన్నమాట. బ్లాక్ వాటర్ ను కోహ్లీతో పాటు బాలీవుడ్ హీరోయిన్లు ఊర్వశి రౌతేలా, మలైకా అరోరా, శ్రుతిహాసన్ వంటి వారు కూడా వినియోగిస్తున్నారు.
Go Back to Shorts
Virat Kohli
Black water
Team India
Shruti Haasan
Bollywood

More Telugu News