ott: నాని సినిమా ఓటీటీలో విడుద‌ల‌వుతుందంటూ ప్ర‌చారం.. నిర్మాణ సంస్థ క్లారిటీ!

shyam singarai directors gives clarity on ott release
షార్ట్స్‌లో చూడండి
నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా సాయి పల్లవి, కృతిశెట్టి హీరోయిన్లుగా రాహుల్‌ సాంకృత్యన్‌ దర్శకత్వంలో ‘శ్యామ్‌ సింగరాయ్‌’ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా డిజిటల్‌, శాటిలైట్‌ రైట్స్‌కు భారీ డిమాండ్ ఉంద‌ని, ఓటీటీలో విడుద‌ల చేసేందుకు ఆయా సంస్థ‌లు భారీగా ఆఫర్‌ చేసినట్లు ప‌లు వెబ్‌సైట్లలో ప్ర‌చారం జ‌రుగుతోంది. అంతేగాక‌, ఓ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ రూ.40 కోట్లు చెల్లించి విడుదల హక్కులు కొనుగోలు చేసిందని కూడా వార్తలు వ‌స్తుండ‌డంతో దీనిపై ఈ సినిమా నిర్మాతలు స్పందించారు.
 
ఈ వార్త‌ల‌న్నీ అవాస్తవాలేనని నిర్మాత‌లు స్ప‌ష్ట‌త నిచ్చారు. ‘శ్యామ్‌ సింగరాయ్‌’ విడుదల విషయంలో తాము ఇప్ప‌టివ‌ర‌కు ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదని వారు చెప్పారు. కాగా, ఈ సినిమాలో నాని రింగుల జుట్టు, కోర మీసాలలతో విభిన్నమైన లుక్‌లో కన‌ప‌డుతుండ‌డం ప్రేక్ష‌కుల‌ను బాగా ఆక‌ర్షిస్తోంది. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై వెంకట్‌ బోయినపల్లి ఈ సినిమాను రూపొందిస్తున్నారు.
Go Back to Shorts
ott
Nani
Tollywood

More Telugu News