taliban: తాలిబన్ల 'బొమ్మ'లాట.. ఎమ్యూజ్ మెంటు పార్కులో బొమ్మ గుర్రాలు, కార్ల‌పైకి ఎక్కి ఆటలు.. వీడియోలు ఇవిగో

  • కాబూల్‌ని ఆక్ర‌మించిన త‌ర్వాత ఘ‌ట‌న‌
  • సామాజిక మాధ్య‌మాల్లో వీడియోలు వైర‌ల్
  • చిన్న‌పిల్ల‌ల్లా ప్ర‌వ‌ర్తిస్తోన్న వైనం
  • ఇప్ప‌టికే పార్ల‌మెంటుకి వెళ్లి కుర్చీల్లోనూ కూర్చున్న ఉగ్ర‌వాదులు
talibans video goes viral

ఆఫ్ఘ‌నిస్థాన్లో తాలిబన్ల పిల్ల చేష్ట‌లకు సంబంధించిన ప‌లు వీడియోలు బ‌య‌టకు వ‌స్తున్నాయి. కాబూల్‌ని ఆక్రమించిన తర్వాత తాలిబన్ల గ్రూపుల్లోని కొందరు.. పిల్ల‌లు ఆడుకునే ఎమ్యూజ్ మెంటు పార్కుకి వెళ్లి ఆడుకున్నారు. ఇందుకు సంబంధించిన‌ దృశ్యాలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ అవున్నాయి.  

చిన్నారులు ఆడుకునే ఎమ్యూజ్ మెంటు పార్కుకు వెళ్లిన తాలిబ‌న్లు అక్క‌డి బొమ్మ గుర్రాలు, కార్ల‌పై స్వారీ చేశారు. చిన్న‌పిల్ల‌ల్లా వారు అక్క‌డ ఆడుకున్న తీరు ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. వారి మాన‌సిక స్థితిని బ‌ట్టి భ‌విష్య‌త్తులో వారు ఆఫ్ఘ‌న్‌లో అనుస‌రించే తీరు ఎలా ఉంటుందో తెలుసుకోవ‌చ్చ‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

ఇటువంటి వాళ్లు దేశాన్ని ప‌రిపాలిస్తారా? అంటూ విమ‌ర్శ‌లు చేస్తున్నారు. కాగా, ఇప్ప‌టికే పార్ల‌మెంటు, అధ్య‌క్ష భ‌వనం వంటి భ‌వ‌నాల‌కు వెళ్లిన తాలిబ‌న్లు అక్క‌డున్న కుర్చీల‌పై కూర్చొని ఫొటోలు తీసుకున్నారు. చిన్న పిల్ల‌ల్లా వారు ప్ర‌వ‌ర్తిస్తున్నారు.    

 
 

More Telugu News