జిమ్‌లో అన్న‌య్య‌ చిరంజీవితో భేటీ అయ్యాను: ఫొటో పోస్ట్ చేసిన‌ ప్ర‌కాశ్ రాజ్‌
Add ap7am to your home Screen

జిమ్‌లో అన్న‌య్య‌ చిరంజీవితో భేటీ అయ్యాను: ఫొటో పోస్ట్ చేసిన‌ ప్ర‌కాశ్ రాజ్‌

an ever inspiring ANNAYA we are blessed to have him
  • చిరంజీవిపై ప్ర‌కాశ్ రాజ్ ప్ర‌శంస‌ల జ‌ల్లు
  • ప‌రిశ్ర‌మ ఎదుర్కొంటోన్న స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం చిరు చొర‌వ‌
  • అన్న‌య్య మాకు స్ఫూర్తిదాయ‌కంగా నిలుస్తున్నారు
  • ఓ వ‌రంలా సినీ ప‌రిశ్ర‌మ‌లో మాకు ఇటువంటి వ్య‌క్తి ఉన్నారు  
మెగాస్టార్ చిరంజీవిని సినీ న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ క‌లిశారు. ఈ సంద‌ర్భంగా చిరుతో తీసుకున్న ఫొటోను ఆయ‌న త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశారు. సినీ ప‌రిశ్ర‌మ ఎదుర్కొంటోన్న స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి చిరంజీవి చూపుతోన్న చొర‌వ ప‌ట్ల ఆయ‌న ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు.

'ఉద‌యాన్నే బాస్ తో జిమ్ లో స‌మావేశ‌మ‌య్యాను. సినీ ప‌రిశ్ర‌మ ఎదుర్కొంటోన్న స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం కోసం ఆయ‌న చూపుతోన్న చొర‌వ‌కు కృత‌జ్ఞ‌త‌లు చెప్పాను. అన్న‌య్య మాకు స్ఫూర్తిదాయ‌కంగా నిలుస్తున్నారు. ఓ వ‌రంలా సినీ ప‌రిశ్ర‌మ‌లో మాకు ఇటువంటి వ్య‌క్తి ఉన్నారు' అని ప్ర‌కాశ్ రాజ్ పేర్కొన్నారు. కాగా, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ ఎన్నిక‌ల్లో ప్ర‌కాశ్ రాజ్ పోటీ చేస్తోన్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే ప్రకాశ్ రాజ్ కు నాగబాబు మ‌ద్దతు ప్ర‌క‌టించారు. త‌మ‌కు చిరంజీవి ఆశీస్సులు కూడా ఉన్నాయ‌ని నాగ‌బాబు చెప్పారు.
Chiranjeevi
Prakash Raj
Tollywood

More Telugu News