Andhra Pradesh: ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు

Corona cases in AP increased
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. గత 24 గంటల్లో 71,030 మంది శాంపిల్స్ ని పరీక్షించగా 1,869 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 385 కేసులు, కర్నూలు జిల్లాలో అత్యల్పంగా 10 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 18 మంది మృతి చెందగా... 2,316 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు.

తాజా గణాంకాలతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 19,87,051కి పెరిగింది. 19,55,052 మంది కోలుకున్నారు. మొత్తం 13,582 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 18,417 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Go Back to Shorts
Andhra Pradesh
Corona Virus

More Telugu News