Payal Rajputh: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • కన్నడ సినిమా చేస్తున్న పాయల్ రాజ్ పుత్ 
  • మహేశ్, అనిల్ రావిపూడి సినిమాపై క్లారిటీ  
  • 'పుష్ప'లో భార్యాభర్తలుగా బన్నీ, రష్మిక
Payal commits her first Kannada film

*  ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేస్తున్న 'ఆర్ఎక్స్ 100' ఫేమ్ పాయల్ రాజ్ పుత్ తొలిసారిగా కన్నడ సినిమాలో నటిస్తోంది. ధనుంజయ హీరోగా శూన్య దర్శకత్వంలో రూపొందే 'హెడ్ బుష్' అనే సినిమాలో పాయల్ కథానాయికగా నటిస్తోంది.
*  మహేశ్ బాబు, అనిల్ రావిపూడి కాంబోలో ఆమధ్య 'సరిలేరు నీకెవ్వరు' వంటి హిట్ సినిమా వచ్చింది. ఇప్పుడు మళ్లీ వీరి కలయికలో మరో సినిమా వచ్చే అవకాశం వుంది. ఈ విషయంపై దర్శకుడు అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చారు. "మహేశ్ కి స్టోరీ చెప్పాను. ఆయనకు బాగా నచ్చింది. అయితే, ఆయన ఇతర కమిట్ మెంట్స్ వల్ల ఆ ప్రాజక్టు సెట్స్ కి వెళ్లడానికి కొంత సమయం పడుతుంది" అని చెప్పాడు.
*  అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ రూపొందిస్తున్న 'పుష్ప' చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదులో జరుగుతోంది. ఈ క్రమంలో  ఈ చిత్రానికి సంబంధించిన ఒక అప్ డేట్ వచ్చింది. ఇందులో హీరో అల్లు అర్జున్, హీరోయిన్ రష్మిక భార్యాభర్తలుగా కనిపిస్తారని సమాచారం.

More Telugu News