తెలంగాణలో కొత్తగా 569 మందికి కరోనా
- గత 24 గంటల్లో 1,05,201 కరోనా టెస్టులు
- గ్రేటర్ హైదరాబాదులో 82 కేసులు
- రాష్ట్రంలో నలుగురి మృతి
- ఇంకా 8,582 మందికి చికిత్స
అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 657 మంది కరోనా నుంచి కోలుకోగా, నలుగురు మరణించారు. తెలంగాణలో ఇప్పటివరకు 6,48,957 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,36,552 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 8,582 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 3,823కి చేరింది.
